Global Vaartha
Date of Publish : 27/10/2026, 1:34 pm
Editor : భవ్య జర్నలిస్ట్

‘మీరు 2.O చూపిస్తే.. మేం 10X చూపిస్తాం’.. జగన్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెటైర్ విసిరారు. ఈరోజు (మంగళవారం) ఎన్డీఏ మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ‘మీరు 2.O చూపిస్తే మేం 10 X చూపిస్తాం. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు’ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బలహీనులే ఇలా మాట్లాడుతారని.. బలవంతులు ఎవరూ కూడా ఇలా మాట్లాడరని అన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు జగన్ జనజీవన స్రవంతికి రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆయనకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయని హితవుపలికారు.రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా ఉంటాయని... స్థానిక సంస్థల ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాలకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు ఎక్కువ స్థానాలకు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. క్లిష్టతరమైనా సరే... రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలు తమ ముందున్నాయన్నారు. ఈసారి స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save