Global Vaartha
Date of Publish : 27/10/2026, 1:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భారత్‌పై వాణిజ్య నిషేధం.. అయినా పాక్‌కు భారత దిగుమతులు 69 శాతం పెరుగుదల!

2025 పహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర పరిణామాల తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ, పాకిస్తాన్‌లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) డేటా ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1) పాకిస్తాన్.. భారత్ నుంచి $61.74 మిలియన్ల (సుమారు రూ.5,876 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. గతేడాది ఇదే సమయానికి ఇది $36.55 మిలియన్లుగా ఉండగా, ఏకంగా 69శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అయితే, భారత్ నుంచి దిగుమతులు 69శాతం పెరిగినప్పటికీ, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్‌కు అయిన ఎగుమతులు సున్నా (Zero)గా నమోదయ్యాయి.(India Pakistan Indirect Trade)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save