Global Vaartha
Date of Publish : 27/10/2026, 1:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పసుపు క్వింటాకు రూ.19 వేలు

 మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు రికార్డుస్థాయిలో ధర నమోదైంది. ఈ మార్కెట్‌కు కాడిరకం పసుపును ఏడుగురు రైతులు 69 బస్తాల్లో, గోళరకం ముగ్గురు రైతులు 30 బస్తాల్లో తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ-వేలం’లో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.19,253, కనిష్ఠంగా రూ.15,589, సగటున రూ.19,252, గోళరకం గరిష్ఠంగా రూ.18,566,కనిష్ఠంగా రూ.8,506, సగటున రూ.17,469 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ఈ మార్కెట్‌కు రెండురోజుల సెలవుల కంటే ముందు ఈ నెల 22న పసుపు విక్రయానికి రాగా క్వింటాకు రూ.13,319 వరకే ధర నమోదైంది. మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత బాగుండడంతో క్రితం మార్కెట్‌తో పోలిస్తే ఒకేసారి క్వింటాకు రూ.6వేలు పెరిగి రూ.19 వేల ధర రావడం గమనార్హం.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save