Global Vaartha
Date of Publish : 27/10/2026, 2:03 pm
Editor : భవ్య జర్నలిస్ట్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వెలుగులు.. భారతీయ సంస్కృతి, సంగీతం, వంటకాల సందడి!

 న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ 'టైమ్స్ స్క్వేర్'లో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని భారతీయ, దక్షిణ ఆసియా సమాజం (Diaspora) వేలాదిగా తరలివచ్చి, భారతీయ సంస్కృతి, కళలు, వంటకాలతో ఈ దీపకాంతుల పండుగను ఘనంగా జరుపుకున్నారు.రోజంతా సాగిన ఈ ఉత్సవాల్లో 'దీపావళి బజార్' (Diwali Bazaar), సాంప్రదాయ దివ్య దీపాల కాంతుల వెలుగులు, వన్ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ టవర్‌పై వర్చువల్ దీపావళి కౌంట్‌డౌన్, 'లైట్ అప్ టైమ్స్ స్క్వేర్ కాన్సర్ట్' ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అమెరికన్ ర్యాపర్ రాజా కుమారి, ప్రముఖ గాయని కనికా కపూర్ మొదలైన కళాకారులు తమ సంగీత ప్రదర్శనలతో మైమరిపించారు.

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్ తో పాటు న్యూయార్క్ గవర్నర్ తరఫున ఆసియన్ అమెరికన్ వ్యవహారాల డైరెక్టర్ షిబు నాయర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు, న్యూయార్క్ స్టేట్ AAPI కమిషన్ సభ్యురాలు నీతా భాసిన్ మాట్లాడుతూ.. 'టైమ్స్ స్క్వేర్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై నుంచి శాంతి, సామరస్యం ఐక్యత అనే దీపావళి నిజమైన సందేశాన్ని చాటిచెబుతున్నాం' అని పేర్కొన్నారు.

2013లో ప్రారంభమైన ఈ 'దివాలీ ఎట్ టైమ్స్ స్క్వేర్' వేడుకలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిచయం చేస్తున్నాయని నిర్వహకులు తెలిపారు.

'ది పీర్, ఏ తాజ్ హోటల్' లో నోరూరించే భారతీయ వంటకాలు

దీపావళి సందర్భంగా న్యూయార్క్‌లోని ప్రసిద్ధ 'ది పీర్, ఏ తాజ్ హోటల్' ఓ ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. న్యూయార్క్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు అయిన 'ఛట్టి' (Chatti), 'జునూన్' (Junoon), 'ముసాఫిర్' (Musaafer)లతో కలిసి 'కలినరీ జర్నీ త్రూ ఇండియా' పేరుతో భారతదేశంలోని వివిధ ప్రాంతీయ రుచులను విదేశీయులకు, భారతీయ-అమెరికన్లకు రుచి చూపించారు. (Times Square Diwali Celebrations)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save