రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం ప్రాసిక్యూట్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ, గనులశాఖ కార్యదర్శిగా కృపానందం బాధ్యతలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన ECIR కేసుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్‌తో పాటు ఇతరులతో కుమ్మక్కై కృపానందం అధికార దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.మైనింగ్ లీజ్ కేటాయింపులో భారతీ సిమెంట్స్‌కు అక్రమ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్టు అభియోగాలు నమోదు అయ్యాయి. PMLA ద్వారా వచ్చిన నేరపూరిత ఆస్తులను వైట్ మనీగా మార్చడంలో పరోక్షంగా సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభ్యర్థన మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(Cr.P.C) సెక్షన్ 197(1) [ప్రస్తుత BNSS, 2023 సెక్షన్ 218] ప్రకారం బి.కృపానందం ప్రాసిక్యూట్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది.