Global Vaartha
Date of Publish : 27/10/2026, 3:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 400 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న తొలి న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా నిలిచాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇదే సమయంలో టీ20 అత్యంత వేగంగా 400 సిక్సర్ల ఓవరాల్‌ జాబితాలో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను ఫిన్‌ అలెన్‌ అధిగమించాడు.వెల్లింగ్‌టన్‌ వేదికగా టాస్‌ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌ ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ (2) విఫలం కాగా.. ఫిన్‌ అలెన్‌ మెరుగ్గా రాణించాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఐదు సిక్సర్ల సాయంతో 40 పరుగులు సాధించాడు. తద్వారా తన టీ20 కెరీర్‌లో కేవలం 3502 బంతుల్లోనే 400 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు అలెన్‌. అయితే మంచి ఫామ్ లో కనిపిస్తున్న అలెన్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.మొత్తంగా ఈ కివీస్ బ్యాటర్ ఒక మ్యాచ్ లోనే రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి.. 198 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save