Date of Publish : 27/10/2026, 8:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్
హూతీలతో సౌదీ అరేబియా రహస్య ఒప్పందం.. శాంతి కోసం రూ.8,800 కోట్ల ఆఫర్..?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడులు ఆపి కాల్పుల విరమణకు అంగీకరిస్తే వారికి ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,800 కోట్లు) అందిస్తామని సౌదీ అరేబియా ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన 'ఇజ్రాయెల్ హయోమ్' పత్రిక వెల్లడించింది (Saudi Arabia Houthis deal).ఈ ప్రతిపాదనలో ఇరాన్ మధ్యవర్తిత్వం వహించినట్లు 'ఇజ్రాయెల్ హయోమ్' పేర్కొంది. సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ అక్టోబర్ 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను సందర్శించినట్లు తెలిపింది. ఈ పర్యటనలో హూతీలతో కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, టర్కీ నిఘా విభాగం అధిపతి ఇబ్రహీం కలిన్తో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారని సదరు పత్రిక పేర్కొంది ($1 billion peace deal).
ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు సంబంధిత మౌలిక సదుపాయాలపై హూతీలు దాడులు చేస్తున్నారు (Saudi Arabia Iran relations). ఈ దాడులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లడంతో పాటు ఇంధన సరఫరాపైనా ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఇంధన మౌలిక సదుపాయాలను కాపాడుకోవడంతో పాటు యుద్ధాన్ని నియంత్రించేందుకు దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే సౌదీ అరేబియా ప్రతిపాదనపై తుది అంగీకారం కుదిరిందా? హూతీలు దీనిని అంగీకరించారా? అనే విషయాలపై స్పష్టత లేదు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.