Global Vaartha
Date of Publish : 27/10/2026, 8:58 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ ‘స్థానిక’ ఎన్నికలు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు(మంగళవారం, అక్టోబర్‌ 27వ తేదీ) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల అంశానికి సంబంధించి ఎవరి నామినేషన్లు అడ్డుకున్నారో వారి విషయంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.నామినేషన్లు వేయలేనివారి ఫిర్యాదులు, ఆధారాలను పూర్తిగా పరిశీలించాలన్న సుప్రీంకోర్టు.. ఈ విషయంలో హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉందని పేర్కొంది. నామినేషన్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. ఎన్నికల నామినేషన్ల వివాదం కేసును సజీవంగా ఉంచింది.
ఇదిలా ఉంచితే, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా కొంతమందికే నామినేషన్లు వేసే అవకాశం కల్పించారని, చాలామందిని మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ లాయర్‌.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వారందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని జడ్పీటీసీల విషయంలోనూ చాలామందికి నామినేషన్లు వేసే అవకాశం కల్పించలేదని వైఎస్సార్‌సీపీ లాయర్‌ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల అంశానికి సంబంధిం​చి ఎవరి నామినేషన్లు అడ్డుకున్నారో వారి విషయంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. నామినేషన్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save