దసరా పండుగ నేపథ్యంలో రంగారెడ్డి రీజియన్‌లో అక్టోబరు 9 నుంచి 25 వరకు 17 రోజులు నిర్వహించిన ప్రత్యేక బస్సుల ఆపరేషన్స్‌తో ఆర్టీసీకి రూ.28.09 కోట్ల ఆదాయం సమకూరింది. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 45.35 లక్షల కిలోమీటర్లు సమర్థవంతంగా నడిపి 27.18 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు వెళ్లగా.. వారిలో 15.10 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సేవలు వినియోగించుకున్నారు. గతేడాది దసరాకు 42.48 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపి రూ.24.30 కోట్ల ఆదాయం ఆర్జించిగా,ఈ ఏడాది 45.35 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపి రూ.28.09 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే 2.87 లక్షల కిలోమీటర్ల అదనపు బస్సు నిర్వహణ నమోదై, కిలోమీటర్లలో 6.76 శాతం వృద్ధి సాధించారు. సుమారు 3.79 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గత సంవత్సరంతో పోలిస్తే 15.58 శాతం వృద్ధిగా నమోదైంది. రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ దసరా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సులను సమర్థవంతంగా నడిపించినట్లు తెలిపారు.