భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని 750 శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) ప్రారంభించింది. 1889, 1904, 1912, 1916 సంవత్సరాల్లో ఆలయ రెండవ ప్రాకారం నుంచి 44 శాసనాలను సేకరించారు. ఆ తర్వాత 2008-09 సంవత్సరంలో గర్భాలయం (ఆనంద నిలయం) గోడల నుంచి మరో 53 శాసనాలను సేకరించే ప్రక్రియను ఏఎస్ఐ ప్రారంభించింది.
గతంలో టీటీడీకి చెం దిన ప్రముఖ శాసన పరిశోధకులు సాధు సు బ్రహ్మణ్య శాస్త్రి తిరుమలలోని శాసనాలను పరిశీలించి వాటిపై కొన్ని సంపుటాలను ప్రచురించారు. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల అ నేక శాసనాలు ఇప్పటికీ అందుబాటులోకి రా లేదు. ఈ 750 శాసనాలు తిరుమల శ్రీవారికి సంబంధించిన రాజకీయ, మతపరమైన, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందించనున్నాయి.