Global Vaartha
Date of Publish : 28/10/2026, 10:32 am
Editor : భవ్య జర్నలిస్ట్

పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల.. అనకాపల్లి జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని.. ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. నదులు, వాగులు, కాలువల సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు. నీటి ప్రవాహ ప్రాంతాల్లో పశువులను మేపేందుకు తీసుకెళ్లవద్దని తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మాడుగుల మండలంలోని పోతనపూడి, వీ.వీ. అగ్రహారం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అలాగే అనకాపల్లి మండలంలోని తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, తుంపాల, సత్యనారాయణపురం, కొత్తూరు గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు. బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది, విజయరామరాజు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటు చోడవరం మండలంలోని గౌరీపట్నం, జన్నవరం, బెన్నవోలు, పి.ఎస్. పేట గ్రామవాసులు.. కశింకోట మండలంలోని కశింకోట, తేగాడ, పెరంటాలపాలెం, జోగారవుపేట గ్రామస్థులతో పాటు రాంబిల్లి మండలంలోని కొత్తూరు, రజాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు.

నర్సీపట్నం-తుని మార్గంలో వరద ఉధృతి.. పోలీసుల ముఖ్య సూచన

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెదురుగడ్డ (దొంగగడ్డ) ఆర్‌అండ్‌బీ రహదారిపై ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో ట్రాఫిక్‌ను మరో మూడు గంటల పాటు నిలిపివేశారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాలని నర్సీపట్నం సీఐ రేవతమ్మ సూచించారు. మోసయ్యపేట-నాతవరం-గొలుగొండపేట-అల్లిపూడి-కోటనందూరు మీదుగా తుని చేరుకోవాలని సీఐ తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save