Global Vaartha
Date of Publish : 28/10/2026, 10:56 am
Editor : భవ్య జర్నలిస్ట్

పన్ను అధికారులకు సీబీఐసీ ఆదేశం

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రిజిస్ట్రేషన్ దరఖాస్తుకు సంబంధంలేని అనవసర పత్రాలను కోరడం లేదా ఊహాజనిత ప్రశ్నలు వేయడం వంటివి చేయొద్దని పన్ను అధికారులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఆదేశించింది. జీఎస్టీ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు బోర్డు మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తుదారు నివాస చిరునామా, మేనేజింగ్‌ డైరెక్టర్‌/అధీకృత సంతకం చేసే వ్యక్తి అదే నగరంలో లేకపోవడం లేదా రిజిస్ర్టేషన్‌ కోరిన రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నలు వేయడంతోపాటు కొన్ని సార్లు అనవసరమైన పత్రాలు కోరడంతోపాటు రిజిస్ర్టేషన్‌ దరఖాస్తులో పేర్కొన్న కార్యకలాపాలను నిర్దిష్ట ప్రాంగణం నుంచి నిర్వహించలేరనే అభ్యంతరాలు లేవనెత్తుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్టు సీబీఐసీ పేర్కొంది. మరోవైపు జీఎస్టీ పన్ను డిమాండ్ల విషయంలో పన్ను అధికారులకు సీబీఐసీ కీలక సూచనలు చేసింది. మోసం, ఉద్దేశపూర్వక తప్పుడు ప్రకటన లేదా వాస్తవాలను దాచిపెట్టడానికి సంబంధించిన కఠిన జీఎ్‌సటీ నిబంధనలను ప్రయోగించే ముందు పన్ను ఎగవేయాలనే ఉద్దేశం పన్నుచెల్లింపుదారుకు ఉన్నట్టు జీఎ్‌సటీ క్షేత్రస్థాయి అధికారులు ఇకపై నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఈ నెల 8న జరిగిన జీఎ్‌సటీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తాజా సర్క్యులర్‌ జారీ అయింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save