Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:02 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్‌.. మునిసిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలివే

  • అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో పట్టణాల్లో జన జీవనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలిన చోట వెంటనే తొలగించేలా తగిన యంత్రాలతో సిబ్బంది అలెర్ట్‌గా ఉండాలన్నారు. ఈదురు గాలులతో ప్రమాదకర హోర్డింగ్‌ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై, డ్రెయిన్‌లలో నీరు నిలువకుండా ఇంజినీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షం కారణంగా పారిశుద్ధ్య సమస్యలు, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

ఆర్నబ్ తుఫాన్ బీభత్సంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ నష్టాలపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ పరిస్థితులపై రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ దిశానిర్దేశం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save