ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న విద్యుత్ వృథాకు తక్షణమే అడ్డుకట్ట వేసి, అన్ని శాఖల్లో ఎనర్జీ ఆడిట్ నిర్వహించాలని ఫోరమ్ ఫర్ బెటర్ లివింగ్ సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డి.వెంకటరామయ్య సచివాలయంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినోతో నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్‌కు తీవ్రకొరత ఏర్పడిందని నివేదించారు.