Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:11 am
Editor : భవ్య జర్నలిస్ట్

​పులివెందులలో ఎన్నికల వేళ ఉద్రిక్తత

  • ​పులివెందులలో ఎన్నికల వేళ ఉద్రిక్తత
  • వైకాపా కార్యకర్త వాహనానికి దుండగుల నిప్పు

పులివెందుల పట్టణంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.ప్రత్యర్థుల దాడులు, విధ్వంసాలతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

​​నగరిగుట్ట ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగరాజుకు చెందిన XUV 500 కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారనే కక్షతోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు నాగరాజు ఆరోపించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save