Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:16 am
Editor : భవ్య జర్నలిస్ట్

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. 950 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్

 భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేల చూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా పడిపోయింది. 22,500 దిగువకు చేరువలో నిఫ్టీ కదలాడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలతో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో గత సెషన్‌లలో కనిపించిన రికవరీ మాయమై ప్రధాన సూచీలు భారీగా క్షీణించాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 73,598.67 తో పోలిస్తే ఉదయం 73,253.44 వద్ద గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగి 894.64 పాయింట్లు (1.22%) నష్టంతో 72,704.03 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ వ్యవధిలో సెన్సెక్స్ దాదాపు 950 పాయింట్ల వరకు పతనమై 72,603.57 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఇక, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,678.00 వద్ద ప్రారంభమై, 230.10 పాయింట్లు (1.01%) నష్టపోయి 22,519.65 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఉదయం సెషన్‌లో 22,497.70 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

పశ్చిమాసియా‌లో ఇరాన్, హౌతీ దాడులు, అమెరికా-సౌదీ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $115 పైనే కొనసాగుతుండటం భారత మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. గ్లోబల్ అమెరికన్ సూచీలు (డౌ జోన్స్, నాస్‌డాక్) లాభాల్లో ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడం, ఆసియా మార్కెట్ల బలహీనత ప్రభావం చూపాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్:

ఈరోజు జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు 21% పైగా ప్రీమియంతో విజయవంతంగా లిస్ట్ అయినప్పటికీ, మార్కెట్ ఒవరాల్ ట్రెండ్ ప్రతికూలంగా ఉండటంతో ప్రధాన సూచీలను కాపాడలేకపోయింది.

ప్రస్తుతానికి నిఫ్టీ 22,500 కీలక సపోర్ట్ స్థాయి వద్ద ఊగిసలాడుతోంది. రోజంతా చమురు ధరల కదలికలు, విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) ప్రవాహంపైనే మార్కెట్ తదుపరి గమనం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.(Stock Market Crash Today)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save