Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:17 am
Editor : భవ్య జర్నలిస్ట్

తీరం దాటిన ఆర్నబ్ తుఫాన్.. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

 ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఆర్నబ్ తుఫాన్ తీరాన్ని దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించారు. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్‌.. తీవ్ర తుఫాన్‌గా బలహీనపడినట్లు పేర్కొంది. ప్రస్తుతం తీవ్ర తుఫాన్ ఐ ప్రాంతంలో గంటకు 125 నుంచి 135 కొన్ని సార్లు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆర్నబ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save