Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:22 am
Editor : భవ్య జర్నలిస్ట్

దొడ్డు వడ్లకూ డిమాండ్‌.. మద్దతు ధరను మించి కొనుగోళ్లు

  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

దొడ్డు రకం ధాన్యానికి గతంలో ఎన్నిడు లేనివిధంగా డిమాండ్‌ వస్తుంది. పదేళ్లుగా దొడ్డు రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకునేవారు. బహి రంగ మార్కెట్‌లో పెద్దగా ధర పలుకపోగా రైతులు ఐకేపీ, సహకార సంఘాల కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని మద్దతు ధర పొందే వారు. మద్దతు ధరకు రెండు నుంచి మూడు వందల తక్కువ ధరకు మిల్లర్లు ప్రైవేట్‌గా కొనుగోలు చేసేవారు. కాగా ఇప్పుడు సన్న వడ్లకు గిరాకీ బాగా పెరుగగా, దొడ్డు రకం వడ్లకు కూడా మద్దతు ధరకు మించి ప్రైవేట్‌గా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో దొడ్డు రకం ధాన్యానికి సోమ, మంగళవారాల్లో గరిష్ఠ ధర క్వింటాలుకు 2,529 రూపాయలు పలి కింది. కనిష్ఠంగా 2400, సగటుగా ధర 2,500 రూపాయలు లభించింది. దీంతో రైతులు మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

దసరా పండుగ తర్వాత కొనుగోళ్లు ప్రా రంభం కాగా ప్రతీ రోజు వెయ్యికిపైగా క్విం టాళ్ల దొడ్డు రకం ధాన్యాన్ని రైతులు మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. సోమవారం మా ర్కెట్‌లో 1,026 క్వింటాళ్ల ధాన్యం తూకం కాగా, మంగళవారం 1,118 క్వింటాళ్ల ధా న్యాన్ని రైతులు వ్యాపారులకు విక్రయించారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడ్డ రైతులు ప్రైవేట్‌లో మద్దతుకు మించి ధర పలుకుతుం డడం,

విక్రయించిన రోజునే నగదు చేతికి రావడంతో హర్షం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి మద్దతు ధర 2,461, కామన్‌ గ్రేడ్‌ మద్దతు ధర 2,441 రూపాయలు ఉంది. గత యాసంగి సీజన్‌లో 95 శాతం ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌ కింద కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు కొనుగోలు చేయగా, వానాకాలంలో అంతకుమించి ధర పలకడం విశేషం. చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌ ప్రస్తుతం దొడ్డు రకం ధాన్యంతో నిండిపోయింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save