Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:33 am
Editor : భవ్య జర్నలిస్ట్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓతో రికార్డు.. రూ.12.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్!

జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) స్టాక్ మార్కెట్‌లో విజయవంతంగా అడుగుపెట్టింది. నిఫ్టీ, సెన్సెక్స్‌లలో 21.36శాతం ప్రాఫిట్‌తో రూ. 1,358 వద్ద లిస్ట్ అయిన తర్వాత, షేరు ధర ఒక దశలో బీఎస్‌ఈలో రూ. 1,375 (22.87శాతం లాభం) వరకు వెళ్లింది.లిస్టింగ్‌తోనే జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ రూ. 12.50 లక్షల కోట్లను దాటింది. తద్వారా భారతదేశంలోనే అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలలో జియో రెండో స్థానంలో నిలిచింది. దీంతో..

1. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) – రూ. 15.89 లక్షల కోట్లు

2. జియో ప్లాట్‌ఫామ్స్ – రూ. 12.50 లక్షల కోట్లు

3. భారతీ ఎయిర్‌టెల్ – రూ. 12.06 లక్షల కోట్లు

4. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ – రూ. 10.42 లక్షల కోట్లు

5. ఐసిఐసిఐ బ్యాంక్ – రూ. 9.80 లక్షల కోట్లతో అగ్రగామిగా నిలిచాయి.

ఆకాశ్ అంబానీ వ్యాఖ్యలు: 'గడిచిన 50 ఏళ్లుగా రిలయన్స్ తన వాటాదారులకు ఎలాంటి విలువను అందించిందో, రాబోయే 50 ఏళ్ల పాటు జియో ప్లాట్‌ఫామ్స్ కూడా అదే నమ్మకాన్ని కొనసాగిస్తుంది' అని జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు.

భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీవోలు

జియో ప్లాట్‌ఫామ్స్ నిధుల సమీకరణతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించింది. ఇదే క్రమంలో..

1. జియో ప్లాట్‌ఫామ్స్: రూ. 30,213 కోట్లు

2. హ్యుందాయ్ మోటార్ ఇండియా: రూ. 27,859 కోట్లు

3. ఎన్‌ఎస్‌ఈ (NSE): రూ. 22,562 కోట్లు

4. ఎల్‌ఐసీ (LIC): రూ. 20,557 కోట్లు

5. పేటీఎం (Paytm): రూ. 18,300 కోట్లు సాధించాయి.(Jio Platforms IPO Listing)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save