Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:41 am
Editor : భవ్య జర్నలిస్ట్

అభివృద్ధి కొనసాగాలి- సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి

కూటమి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా. ఎన్నికల ప్రచారం

సింహాద్రిపురం జడ్పీటీసీ సభ్యుడు మారెడ్డి జయ భరత్ రెడ్డి!

లింగాల కదిలించే వార్త అక్టోబర్ 28

లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి సతీమణి, లింగాల మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి యమ్మనూరు సరళ దేవి విజయమే లక్ష్యంగా బోనాల, అంకెవానిపల్లె గ్రామాల్లో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సింహాద్రిపురం జడ్పీటీసీ సభ్యుడు మారెడ్డి జయ భరత్ రెడ్డి , పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ , లింగాల మండల టీడీపీ ఇంచార్జ్, కామసముద్రం ఎంపీటీసీ దేవిరెడ్డి సంజీవ రెడ్డి ఇంటి ఇంటి తిరిగి సరళ దేవి ని గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి సహకారంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను** ప్రజలకు వివరించారు.

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థి యమ్మనూరు సరళ దేవికి మద్దతు తెలిపి, ఘనవిజయం చేకూర్చాలని ప్రజలను అభ్యర్థిస్తూ,

అభివృద్ధి కొనసాగాలి సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి కూటమి అభ్యర్థులు గెలవాలి అంటూ ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు .ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save