Global Vaartha
Date of Publish : 28/10/2026, 11:47 am
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌లో దుర్గామాత ఊరేగింపుపై కోడిగుడ్ల దాడి.. కేసు నమోదు

మాదన్నపేటలో దుర్గామాత ఊరేగింపుపై కోడిగుడ్లతో దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 25న దుర్గామాత ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ఇంటి నుంచి కోడిగుడ్లు పడినట్లు అశ్విన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌస్ నంబర్ 17-2-714/13 నుంచి కోడిగుడ్లు పడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మదన్నపేట పోలీసులు 196(2), 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. మదన్నపేట పోలీస్ స్టేషన్‌లో యాకుత్‌పుర ఎమ్మెల్యే హంగామా చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. విచారణ నిమిత్తం పోలీసులు తీసుకొచ్చిన నలుగురు అనుమానితులను ఎమ్మెల్యే బలవంతంగా వెంట తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేసు విచారణలో ఉన్న అనుమానితులను ఎమ్మెల్యే ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించాయి. ఈ పరిణామాలతో కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే.. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసుల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save