Global Vaartha
Date of Publish : 28/10/2026, 12:07 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన

రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా సెక్రటేరియెట్‌లోని ఆర్టీజీఎస్ నుంచి సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని పరిశీలించారు. ఆర్నబ్ తుఫాన్ గమనాన్ని.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎంకు ఆర్టీజీఎస్ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్ల ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని సీఎం సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వివరించారు. మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save