Global Vaartha
Date of Publish : 28/10/2026, 12:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన

రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా సెక్రటేరియెట్‌లోని ఆర్టీజీఎస్ నుంచి సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని పరిశీలించారు. ఆర్నబ్ తుఫాన్ గమనాన్ని.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎంకు ఆర్టీజీఎస్ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్ల ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని సీఎం సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వివరించారు. మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

యంత్రాంగం అపూర్తిగా లర్ట్...

ఆర్నబ్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు అధికారులు, యంత్రాంగంతో మాట్లాడుతూ సమీక్ష నిర్వహించారు. ప్రజల ఇబ్బందులను తొలగించేలా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని ప్రభుత్వం సమాయత్తం చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు.. మండల, గ్రామ స్థాయి సిబ్బందితో మాట్లాడుతుండడంతో యంత్రాంగం పూర్తిగా అలర్ట్‌ అయ్యింది. సిబ్బంది.. రాత్రి నుంచి రోడ్లపై ఉండి తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కూలిన చెట్లు తొలగింపు ప్రక్రియను విద్యుత్ శాఖ సిబ్బంది రియల్ టైంలో చేపట్టారు. తుఫాన్ నష్టం ఎక్కువ ఉండే ప్రాంతంలో ముందుగానే విద్యుత్ స్థంభాలు, సామగ్రిని అధికారులు సిద్ధం చేసుకున్నారు. భారీ వర్షంలో కూడా రోడ్లపై నిలబడి సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం పాల్గొంటోంది. వాట్సాప్, సోషల్ మీడియా, మీడియా, కంట్రోల్ రూంలకు వస్తున్న సమాచారంపై, ఫిర్యాదులపై ఆయా శాఖల సిబ్బంది వెంటనే స్పందిస్తోంది. ప్రభుత్వ సత్వర స్పందనతో విద్యుత్ పునరుద్ధరణ, చెట్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించింది. మంత్రులు.. ఆయా ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save