Global Vaartha
Date of Publish : 28/10/2026, 12:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారితో సహా దంపతుల మృతి

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) మూడో ఫేజ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దంపతులు.. రెండేళ్ల చిన్నారి విగతజీవులుగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్, సమత 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల పాప ఉంది. అయితే.. మంగళవారం ఉదయం నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగి డయల్‌ 112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి చూడగా.. డైనింగ్ హాల్లో గోపీనాథ్, సమత ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. బెడ్‌రూమ్‌లో రెండేళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపీనాథ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తు్న్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save