Global Vaartha
Date of Publish : 28/10/2026, 1:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పెద్దారెడ్డి కోటకు బీటలు

 తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కంచుకోట తిమ్మంపల్లిలో టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యం వహిస్తున్న పెద్దారెడ్డి కోటలో తొలిసారి టీడీపీ పాగా వేసింది. యల్లనూరు మండల చరిత్రలో ఇప్పటివరకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవని టీడీపీ... తిమ్మంపల్లి ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుంది. 1986లో మండల వ్యవస్థ ఏరాటైంది. ఈ 40 సంవత్సరాలలో కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పది ఎంపీటీసీ స్థానాలకు 33 మంది నామినేషన్లు వేశారు.అందులో 13 మంది వైసీపీ, 20మంది టీడీపీవారు ఉన్నారు. తిమ్మంపల్లి ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు నామినేషన్‌ వేశారు. వైసీపీ అభ్యర్థి అరుణ సోమవారం, మరొక అభ్యర్థి దేవి మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి లక్ష్మిదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అర్షద్‌ వలి ప్రకటించారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఇది సాధ్యమైందని శ్రేణులు అంటున్నాయి

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save