పార్టీ అండగా ఉంటుందని భరోసా
పులివెందుల అర్బన్ అక్టోబర్ 28:
పోలీసుల రబ్బర్ బుల్లెట్ తూటా తగిలి గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గండికోట పవన్ కుమార్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
పులివెందుల పట్టణానికి చెందిన గండికోట నాగభూషణం కుమారుడు పవన్ కుమార్,ఈ నెల 17న నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో పోలీసుల కాల్పులకు గురయ్యారు.ఆ సమయంలో కాలికి రబ్బర్ బుల్లెట్ బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్న వైయస్ జగన్‌ను బాధితుడు పవన్ కుమార్ స్వయంగా కలిసి,ఆ రోజు జరిగిన ఘటనను వివరించారు.పవన్ ఆరోగ్య పరిస్థితిని,గాయం నయమవుతున్న తీరును జగన్ అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి ఆందోళన చెందవద్దని,ధైర్యంగా ఉండాలని పవన్ కుమార్‌కు ఆయన ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు,నాయకత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.