Global Vaartha
Date of Publish : 28/10/2026, 1:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్త

  • ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్త
  • కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బొంగగాని భారతి యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం
  • అజ్జుగుట్టు రవితేజ రెడ్డి*
  • పులివెందుల కదిలించే వార్త అక్టోబర్ 28

పులివెందుల మండల పరిధిలో

చంద్రగిరి హరిజనవాడ, గుండువారిపల్లి, యర్రబల్లె గ్రామాల్లో పులివెందుల మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బొంగగాని భారతి యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ. కొత్తపల్లె మాజీ సర్పంచ్ గంగాధర్ యాదవ్ సతీమణి, కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బొంగగాని భారతి యాదవ్ కి మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అజ్జుగుట్టు రవితేజ రెడ్డి , పులివెందుల నియోజకవర్గ పరిశీలకుడు సామకోటి ఆదినారాయణ పులివెందుల మండల టీడీపీ అధ్యక్షుడు మర్తల జగన్ మోహన్ రెడ్డి , ఈ. కొత్తపల్లె ఎంపీటీసీ పుష్పనాథ్ రెడ్డి , పుష్పగిరి స్కూల్ కరస్పాండెంట్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న కూటమి అభ్యర్థి బొంగగాని భారతి యాదవ్ కి ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save