Global Vaartha
Date of Publish : 28/10/2026, 2:01 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డంకులా?.. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై హరీశ్ ఫైర్

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయటాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కరవు రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు తెలంగాణ సమాజం బుద్ధి చెప్పడం ఖాయమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

హరీశ్‌రావు పోస్ట్..

‘మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నాను. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు. మీ నిర్లక్ష్యం వల్ల కరవు బారిన పడిన రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మానేసి.. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటారా? కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ.. కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయం. ఒక వైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు ఎంతకాలం నొక్కుతారు? ఎన్ని రోజులు అణచివేస్తారు? తెలంగాణ సమాజం మీకు తప్పక బుద్ధి చెబుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లూటీఫికేషన్ ప్రయత్నాలను తిప్పికొడుతుంది! అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో హరీశ్‌రావు పోస్ట్ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save