ఢిల్లీ : 2027లో నిర్వహించనున్న డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కులాల నమోదు కోసం ప్రత్యేకంగా 'డ్రాప్-డౌన్ మెనూ'ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు కీలక సూచనలు చేసింది.డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించే సమయంలో ఓబీసీ కులాల పేర్లు స్పష్టంగా నమోదయ్యేలా డిజిటల్ ఫారమ్‌లో ఒక ప్రత్యేక 'డ్రాప్-డౌన్ మెనూ'ను చేర్చాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.
జనాభా లెక్కల విధాన రూపకల్పన, డిజిటల్ ఫార్మాట్‌ను నిర్ణయించడం అనేది పూర్తిగా సంబంధిత జనాభా లెక్కల అధికారుల పరిధిలోని అంశమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై నేరుగా సెన్సస్ అధికారులకే వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.
డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాల నమోదుకు సాంకేతికంగా ఎలాంటి విధానం ఉండాలనేది న్యాయస్థానాల పరిధి కాదని, సంబంధిత అధికారులే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.(OBC Caste Dropdown Menu Census 2027)