Global Vaartha
Date of Publish : 28/10/2026, 3:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు.. ట్రంప్ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. ఈ చర్చల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య 5 సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి ట్రంప్ ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ చర్చల ద్వారా పురోగతి సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా నవంబర్‌లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు ప్రారంభమవుతాయని జెలెన్‌స్కీ గత ఆదివారం వెల్లడించారు. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 2022లో మొదలైన రష్యా-ఉక్రెయిన్ వార్ వేలాదిమందిని బలి తీసుకుంది. 2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ 24 గంటల్లో ఈ యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ మాట ఇచ్చి సంవత్సర కాలం గడిచినా యుద్ధం ఆగలేదు. మరోవైపు అతి త్వరలో జరిగే శాంతి చర్చలు ఫలిస్తాయని అమెరికా అధ్యక్షుడు నొక్కిచెబుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save