Global Vaartha
Date of Publish : 28/10/2026, 3:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాజ్యసభ ఉపఎన్నిక.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థిగా హర్దీప్ సింగ్ పురి

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజీనామాతో జరుగుతున్న రాజ్యసభ ఉప ఎన్నికలో మధ్యప్రదేశ్‌ నుంచి హర్దీప్ సింగ్ పురి బరిలోకి దిగారు. ఈ మేరకు బీజేపీ ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉండగా కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీలు ఉన్నారు.ఎల్ మురుగన్ రాజీనామా నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 12 ఎన్నిక జరగనుంది. నామినేషన్ దాఖలుకు నవంబర్ 2 చివరి తేదీగా కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 5. నవంబర్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖ సహాయమంత్రిగా ఉన్న ఎల్ మురుగన్ అక్టోబర్ 14న మంత్రి మండలి నుంచి తప్పుకోవడంతో పాటు రాజ్యసభ ఎంపీగా కూడా రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2030 ఏప్రిల్ 2న ముగియాల్సి ఉండగా అంతకంటే ముందే ఆయన తప్పుకున్నారు. తమిళనాడులో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తప్పుకుంటున్నట్టు అప్పట్లో ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీనే అధికారంలో ఉండటంతో హర్దీప్ సింగ్ పురి ఎన్నిక నల్లేరు మీద నడకే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం హర్దీప్ సింగ్ పురి పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. 1974 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. 2020 నవంబర్‌లో యూపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save