Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:19 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పులివెందులలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

కడప జిల్లా, గ్లోబల్ వార్త: పులివెందులలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 20 కుటుంబాలు చేరాయి. పసుపు కండువా కప్పి పార్టీలోకి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఈరోజు (బుధవారం) సాదరంగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. టీడీపీ విధివిధానాలు నచ్చి యువత ఎక్కువ శాతం తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.పులివెందులలో టీడీపీ వైపు ప్రజలు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారని బీటెక్ రవి తెలిపారు. నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి గీతా కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save