Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:30 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రెండు హైస్పీడు రైళ్లు ఢీ.. 39 మంది మృతి

స్పెయిన్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడు రైళ్లు ఢీకొనడంతో 39 మంది దుర్మరణం చెందినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో టొలీడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఓ రైలు అదుపు తప్పి పక్కనే వెళుతున్న మరో రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్, ఆండలూసియా మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు.ఈ ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ స్పందించారు. ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అత్యవసర బృందాలు బాధితులకు సాయం అందిస్తున్నాయని చెప్పారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు సమీపంలోని ఓ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు టొలీడో నగర మేయర్ తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో దక్షిన స్పెయిన్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. పట్టాలు తప్పిన ఓ రైలు ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐరోపాలో అత్యంత విస్తృతమైన రైల్ నెట్‌వర్క్ ఉన్న స్పెయిన్‌లో ఈ ప్రమాదం పెనుకలకలానికి దారి తీసింది. ఇక 2013లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఏకంగా 80 మంది కన్నుమూశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save