Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్.. 30 ఏళ్ల రికార్డు బ్రేక్‌

 ముక్కోణపు సిరీస్‌లో భాగంగా లాహోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక ఈ సిరీస్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం పాకిస్థాన్‌తో శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. లాహోర్ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుషంక చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ గడ్డ మీద అదే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పేసర్‌గా రికార్డు సాధించాడు.

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 25.3 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో పాక్‌కు ఇది రెండో అత్యల్ప వన్డే స్కోరు కావడం గమనార్హం. బాబర్‌ ఆజమ్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌ నిలిచాడు. లంక బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దిల్షాన్‌ మదుషంక 34 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్‌.. పాక్‌ బ్యాటర్లు ఫఖర్ జమాన్‌ (5), సాద్‌ బేగ్‌ (5), అరాఫత్‌ మిన్హాస్‌ (10), కెప్టెన్‌ షాహీన్‌ ఆఫ్రిది (15), హ్యారిస్‌ రవూఫ్‌ (1) వికెట్లు కూల్చాడు. పాక్‌ గడ్డ మీద ఐసీసీ సభ్యదేశాలకు చెందిన ఏ పేసర్‌కు అయినా ఇవే(5-34) అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ పేసర్‌ క్రిస్‌ హారిస్‌ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును దిల్షాన్‌ బద్దలు కొట్టాడు. 1996లో కివీస్ బౌలర్ హారిస్ 42 పరుగులు ఇచ్చి.. ఐదు వికెట్లు తీశాడు. .

పాకిస్థాన్ గడ్డపై పాక్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన పేసర్లు

దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక)- 2026లో లాహోర్‌, 5-34

క్రిస్‌ హారిస్ (న్యూజిలాండ్‌)- 1996లో లాహోర్‌, 5-42

క్రెయిగ్‌ మెక్‌డెర్మాట్‌ (ఆస్ట్రేలియా)- 1987లో సియోల్‌కోట్‌ , 5-44

బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ (జింబాబ్వే)- 2020లో లాహోర్‌, 5-49

గ్లెన్‌ మెగ్రాత్‌ (ఆస్ట్రేలియా)- 1984లో రావల్పిండి, 5-52.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save