Global Vaartha
Date of Publish : 28/10/2026, 7:08 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తెలుగుదేశం పార్టీలోకి యువత భారీ చేరికలు

  • యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీటెక్ రవి

పులివెందుల పట్టణంలో తెలుగుదేశం పార్టీలోకి యువత చేరికలు కొనసాగుతున్నాయి. చంటి ఆధ్వర్యంలో శ్రీరామ హాల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్నేహ బృందానికి చెందిన పలువురు యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు టీడీపీ నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పులివెందుల మున్సిపాలిటీలో ఇప్పటికే 20 వార్డులను టీడీపీ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని పేర్కొన్నారు. మిగిలిన 20 వార్డుల్లోనూ ప్రజలు టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.గత 20 సంవత్సరాలుగా ప్రజలు ఒకే పార్టీ పాలనను చూశారని, ఇప్పుడు టీడీపీ అభ్యర్థులను గెలిపించి తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని కూడా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో పూర్తి మెజారిటీ సాధిస్తే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save