Date of Publish : 28/10/2026, 7:26 pm
Editor : భవ్య జర్నలిస్ట్
పులివెందుల సభలో బీటెక్ రవి ఆగ్రహం
- ఒక అవకాశం ఇవ్వండి, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం
- దశాబ్దాల కుటుంబ పాలనకు స్వస్తి పలకండ
- జగన్మోహన్ రెడ్డి వీధి నాయకుడి మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తాం
పులివెందులలో దశాబ్దాల కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని, జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, కూటమిది చేతల ప్రభుత్వం వైకాపాది మాటల ప్రభుత్వమని, పులివెందుల ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి చేసి మీ ముందు నిలబడతామని పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల అంగళ్ల సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి), సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యకర్తల ఉద్దేశించి ప్రసంగించారు.వైఎస్సార్సీపీ హయాంలో మున్సిపాలిటీలోని మొత్తం 33 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఏమైనదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ రోజున వైఎస్సార్సీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకున్నారని, మరుసటి రోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్ల కేంద్రానికి వెళ్లిన సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు గతంలో నాపై అక్రమ కేసులు పెట్టారని, తాడేపల్లిగూడెంకు పరిమితం అయిన జగన్ ఇప్పుడు కార్యకర్తల గురుంచి ఆలోచన శోచనీయమని, గత ప్రభుత్వం లో వైసీపీ కార్యకర్తలకు బిల్లు లు రాక ఇబ్బంది పడ్డారని, జగన్ నువ్వు నేర్పిన విద్యే నిరజాక్ష అంటున్నారు ప్రజలు చర్చించుకుంటున్నారని, సొంత చెల్లికే అన్యాయం చేసిన జగన్, సొంత చెల్లి బెంగళూరు ప్యాలస్ లో పెళ్లి చేసుకుంటుంటే ఓరవడం లేదని, జగనన్న ఇళ్లలో అక్రమాలకు పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని, జగనన్న ఇళ్లకు 35 వేలు అక్రమంగా వసూలు చేశారని, పులివెందుల నగిరి గుట్టలో నివాసం ఉన్నవాళ్లకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని, ఆర్య వైశ్యులను అన్ని విధాలా వాడుకుని వదిలేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వైయస్ కుటుంబం వివేకానంద రెడ్డి హత్యపై వాడిన డ్రామాలు అన్ని ఇన్ని కావని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాల్లో వారు అభాస పాలయ్యారన్నారు. మాజీ జెడ్పిటిసి మా రెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి గీతా కుమారిని మరియు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూగుట్ల మధుసూదన్ రెడ్డి, చైర్ పర్సన్ అభ్యర్థి గీతా కుమారి, పేర్ల పార్థసారధి రెడ్డి, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహబూబ్ బాషా, పుష్పనాధ రెడ్డి, అమర్ మరియు ఇతర తెదేపా నేతలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.