Global Vaartha
Date of Publish : 28/10/2026, 9:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పులివెందుల టిడిపి పట్టణ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ రెడ్డి నియామకం

  • అభినందనలు తెలిపిన బీటెక్ రవి

పులివెందుల టిడిపి పట్టణ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ రెడ్డిని నియామకం చేసినట్లు బుధవారం పులివెందుల పట్టణ పరిధిలో పూలంగళ్ళ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో బీటెక్ రవి ప్రకటించారు. గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళుతూ అధినేత బీటెక్ రవికి అండదండలుగా ఉంటూ తనదైన పాత్ర పోషిస్తున్న బొజ్జాయిపల్లె వెంకటేశ్వర్ రెడ్డి కి పులివెందుల పట్టణ అధ్యక్షుడిగా పదవి ప్రకటించడం,
 పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పులివెందుల పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా బీటెక్ రవికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save