Global Vaartha
Date of Publish : 28/10/2026, 9:42 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కడప నగరంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం..

  • కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మాధవి గారు, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి

కడప నగర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి మేయర్ అభ్యర్థిని సువర్ణ మట్లి  గెలుపు కోసం ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా 8, 9 వ డివిజన్లలోని అప్సర సర్కిల్, ఆంజనేయస్వామి టెంపుల్ మీదుగా ప్రచారం కొనసాగించి, అనంతరం చిన్నచౌక్ ఆంజనేయ స్వామి గుడి వద్ద భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అదేవిధంగా 11, 13 వ డివిజన్లలోని శంకరాపురంలో గల బ్లైండ్ స్కూల్ మీదుగా ప్రచారం చేపట్టి, అనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ & కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి , టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి  పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కడప నగరంలో ప్రశాంత వాతావరణం, సమగ్రాభివృద్ధి సాధ్యపడాలంటే కూటమి పాలన రావాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 1న జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లోని 5వ నంబర్ 'సైకిల్' గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సువర్ణ మట్లి గారిని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save