Date of Publish : 29/10/2026, 9:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్
నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి
కడప నగరంలోని సంగం ఫంక్షన్ హాల్లో జరిగిన సగబాల వారి వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు మదన్ గోపాల్ - శ్రీ లక్ష్మి గార్లను ఆత్మీయంగా అభినందించి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.