Date of Publish : 30/10/2026, 10:45 am
Editor : భవ్య జర్నలిస్ట్
నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ
- 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,690 కోట్లు జమ
పీఎం-కిసాన్ పథకం కింద దేశంలోని 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ నిధులను జమ చేయనున్నారు. 24వ విడత కింద రూ.18,690 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ కానున్నాయి. గుజరాత్లోని బనస్కాంతలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ నిధులను బదిలీ చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని రైసన్ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-ఐఏఎఫ్) కింద నెలకొల్పిన 521 యూనిట్లును ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.