Date of Publish : 30/10/2026, 1:49 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఏపీ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు.. రూ.2,234 కోట్లు విడుదల
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో నిధులను కూటమి ప్రభుత్వం జమ చేసింది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో రెండో విడతగా రాష్ట్ర వాటాగా రూ.2,234.03 కోట్ల నగదును విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేగంగా రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 99.44 శాతం మంది రైతుల ఖాతాలో ఈ ఆర్ధిక సాయం జమ కానుంది.వివిధ సాంకేతిక కారణాలతో కేవలం 17,828 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. త్వరితగతిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి మిగిలిన రైతులకూ ఈ నిధులు అందేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ రెండేళ్లలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కింద రూ.15,236.35 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిన విషయం విదితమే.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.