Global Vaartha
Date of Publish : 31/10/2026, 9:47 am
Editor : భవ్య జర్నలిస్ట్

మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి

  • తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్ట్‌లో భాగంగా మరికొద్ది రోజుల్లోనే గగన్‌యాన్ D1ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ వెల్లడించారు

 త్వరలోనే గగన్‌యాన్ D1ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. గగన్‌యాన్‌లో భాగంగా.. తొలి మానవ సహిత ప్రయోగం చేపట్టబోతున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు రాబోవు రోజుల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో రాకెట్ల ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తామని నారాయణన్ తెలిపారు. గగన్‌యాన్‌లో భాగంగా మూడు ఎన్‌విఎస్ శాటిలైట్లు పనిచేస్తుండగా..ఎన్‌విఎస్-03 నాలుగవ శాటిలైట్ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 పీఎస్ఎల్వీ, 1 గగన్‌యాన్, 1 ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టబోతున్నామని చైర్మన్ నారాయణన్ వెల్లడించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save