Global Vaartha
Date of Publish : 31/10/2026, 3:56 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాప్తాడు ఘటన.. విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

 అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో టెన్త్ విద్యార్థిని ఓ యువకుడు రంపంతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థినిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.విద్యార్థినికి అందుతున్న వైద్య సాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇరువురు విద్యార్థినిలకూ మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save