Date of Publish : 31/10/2026, 4:20 pm
Editor : భవ్య జర్నలిస్ట్
భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..?
ఈరోజుల్లో భోజనం తింటూ ఫోన్ చూడటం చాలా మామూలు విషయం. చాలామంది ఆహారాన్ని తీసుకుంటూ మొబైల్ చూడటానికి అలవాటుపడిపోయారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై పలు ప్రభావాలు చూపిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. తినే సమయంలో కూడా ఫోన్‌కు రెస్ట్ ఇవ్వకపోతే పలు సమస్యలు వస్తాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
జీర్ణక్రియపై ప్రభావం..
భోజనం చేస్తూ మొబైల్ చూడటం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మన ధ్యాస తినటంపై కాకుండా ఫోన్‌పై ఉన్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలలేము. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలొస్తాయి. అందుకే తినేటప్పుడు ఫోన్ చూడొద్దంటున్నారు వైద్య నిపుణులు.
కళ్లకూ హాని
ప్రస్తుతం మన రోజువారీ స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటోంది. భోజనం చేస్తున్న సమయాల్లో కూడా ఫోన్ చూడటం వల్ల స్క్రీన్ టైమ్ మరింత పెరిగిపోతోంది. కళ్లకు విశ్రాంతి కరువవుతోంది. కాబట్టి భోజన వేళల్లో మొబైల్ దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కళ్లకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని వివరిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపై దెబ్బ
ఫోన్ చూస్తూ ఆహారం తీసుకునే అలవాటు మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. తినేటప్పుడు మొబైల్ ఉపయోగించటం వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేము. తద్వారా మానసిక సంతృప్తి దూరమై, ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
సామాజిక సంబంధాలు
ఇదివరకు భోజన వేళల్లో కుటుంబంతో గడిపేవారు. ఇప్పుడు ఫోన్లలో మునిగిపోతున్నారు. దీనివల్ల సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే ఈ సమయంలో ఫోన్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.