Global Vaartha
Date of Publish : 31/10/2026, 4:43 pm
Editor : భవ్య జర్నలిస్ట్

దిశానిర్దేశం

  • మున్సిపల్ ఎన్నికల విధులపై పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పుట్టపర్తి డీఎస్పీ మాణిక్యరావు గారు...

పుట్టపర్తి మున్సిపాలిటీలో రేపు ఆదివారం పుట్టపర్తి లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు నియమించబడిన పోలీసు అధికారులు, సిబ్బందికి పుట్టపర్తి డీఎస్పీ శ్రీ మాణిక్యరావు విధుల నిర్వహణపై ప్రత్యేక బ్రీపింగ్ నిర్వహించి పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ..
ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది సమయానికి తమకు కేటాయించిన విధుల్లో రిపోర్ట్ చేయాలి.
పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించాలి.
పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమిగూడకుండా చూడాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలి.
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save