Date of Publish : 31/10/2026, 4:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఆంజనేయునికి విశేష పూజలు
సింహాద్రిపురం గ్రామంలో అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకం సహస్రనామార్చన అష్టోత్తర శతనామావళి ఆకు పూజ తదితర పూజ కైకర్యాల అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి శనివారం ,మంగళవారం భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.