Date of Publish : 31/10/2026, 8:52 pm
Editor : భవ్య జర్నలిస్ట్
చదువుల గుడిలోనే రక్షణ కరువైతే.. ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఏది?
- రాప్తాడులో గోపికపై జరిగిన దాడి సభ్యసమాజం తలదించుకోవాల్సిన దుర్ఘటన..!
- ఇలాంటి నాకొడుకులు బయట తిరుగుతుంటే ఆడపిల్లలను బడులకు పంపే ధైర్యం చేయలేం..!
- వాడు సైకోనా, లేదంటే గంజాయికి అలవాటుపడ్డ వ్యసనపరుడా?
- మా రాప్తాడు బిడ్డ ఆరోగ్యంగా బయటకు రావాలి.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
జిల్లా కేంద్రానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపికపై ఓ దుండగుడు విద్యుత్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేయడం అత్యంత దారుణం అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
వాపోయారు. శనివారం అనంతపురం సర్వజన ఆస్పత్రిలో గోపికను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
👉తరగతి గదిలో తోటి విద్యార్థుల మధ్య చదువుకుంటున్న బాలికపై చెంప, వీపు, భుజం, చేతిపై తీవ్రంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిని కూడా గాయపరిచాడు. ఈ భయానక ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
👉ఇది ఒక్క గోపిక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదం మాత్రమే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల భద్రతపై ప్రతి తల్లిదండ్రి మనసులో తలెత్తుతున్న ప్రశ్న!. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే ఇంతటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
👉పాఠశాలల్లో ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది?
తరగతి గదిలోకి ప్రమాదకరమైన పరికరంతో దుండగుడు ఎలా ప్రవేశించాడు? సామాన్య కుటుంబాలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలి.
👉 గోపికకు అత్యుత్తమ వైద్యం అందించాలి. అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించాలి. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు వ్యవహరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి.
👉తరగతి గదిలో కూడా విద్యార్థుల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. పోలీసు, ఇంటిలిజెన్స్, ప్రభుత్వం పాuý శాలల్లో బాలికలకు రక్షణ కల్పించాల్సి ఉంది.
👉ఒక మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ దారుణం చోటు చేసుకోవడం బాధాకరం. ఇందుకు బాధ్యత వహించాలి. ఇది చాలా దురదృష్టకరం. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని తెలిసింది.
👉నిందితుడిని మీరు శిక్షిస్తారా లేదంటే మాకు అప్పగిస్తారా? అని బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను అడుగుతున్నారు. అధికార పార్టీకి, డబ్బులకు పోలీసులు ఎక్కడ లొంగిపోతారోనని వారు మాట్లాడుతున్నారు.
👉జిల్లాలో పోలీసు యంత్రాంగం సామాన్యుల పక్షాన లేదు అనే వాదన వారినుంచి వినిపిస్తోంది. డబ్బు ఇచ్చినవాడికి, అధికారం ఉన్నవాడి పక్షాన ఉందికాబట్టే మాకు నమ్మకం లేదని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇది. సామాన్యులు గుండెలమీద చేయి వేసుకుని నిద్రపోయేలా పోలీసుల తీరు ఉండాలి.
👉వాడెవడో చేసిన దురాగాతానికి పోలీసులను తప్పు పట్టడం లేదు. పోలీసులపై ఉన్న అపనమ్మకాన్ని వ్యక్తం చేసిన తల్లిదండ్రుల బాధను నేను తెలియజేస్తున్నా. ఇదే గ్రామానికి నిందితుడిని తీసుకొచ్చి శిక్షించాలి.
👉ఇలాంటి నాకొడుకులు బయట తిరుగుతుంటే ఆడపిల్లలను బడులకు పంపే ధైర్యం చేయలేం. వాడు సైకోనా, లేదంటే గంజాయికి అలవాటుపడ్డ వ్యసనపరుడా? రాప్తాడు నియోజకవర్గంలో ఏమి జరుగుతోందో ఎస్పీగారు చర్యలు తీసుకోవాలి. బాధితురాలిని ఉన్నత వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లయినా సరే బాగు చేయించాలి.
👉మా రాప్తాడు బిడ్డ ఆరోగ్యంగా బయటకు రావాలి. ఆ అమ్మాయికి అంగ వైకల్యం వచ్చినా, ప్రాణాలమీదకు వచ్చినా చూస్తూ ఊరుకోం. లాఅండర్‌ఆర్డర్ మెయింటినెన్స్ చేయలేని ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలి..
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.