Global Vaartha
Date of Publish : 01/11/2026, 7:24 am
Editor : భవ్య జర్నలిస్ట్

శ్రీవారి ఆలయంలో 495 ఏళ్ల నాటి శాసనం

  • అచ్యుతదేవరాయల కాలం నాటిదిగా గుర్తింపు

 తిరుమల శ్రీవారి ఆలయంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుతదేవరాయల కాలంనాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సుమారు 495 ఏళ్ల నాటి ఈ శాసనాన్ని భారత పురావస్తుశాఖ(ఏఎస్‌ఐ) అధికారులు ఇటీవల అచ్చు తీశారు. ఆలయంలోని మూడో ప్రాకారం గోడపై ఈ శాసనం ఉన్నట్టు ఏఎ్‌సఐ ఎపిగ్రఫీ విభాగ డైరెక్టర్‌ కె.మునిరత్నంరెడ్డి వెల్లడించారు. క్రీ.శ 1531 ఫిబ్రవరి 13 నాటి ఈ శాసనం తమిళ భాషలో ఉంది. శక సంవత్సరం 1462 శార్వరి నామ సంవత్సరం కుంభ మాసం, బహుళ తదియ, ఆదివారంనాటి వివరాలున్నాయి. తిరుమలలో నివసించే ఏకాంగి శ్రీవైష్ణవుల్లో ఒకరైన పేరరుళాళయ్యన్‌ దానధర్మ వ్యవహారాన్ని ఈ శాసనం వివరిస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save