Date of Publish : 01/11/2026, 7:28 am
Editor : భవ్య జర్నలిస్ట్
రాజకీయమంటే అందలం కాదు: జస్టిస్ ఎన్వీ రమణ
రాజకీయమంటే అందలం ఎక్కడం కోసం కాదు. సేవా దృక్పథం కలిగి ఉండాలి. నేటి రాజకీయాల్లో విలువలు పూర్తిగా పోయాయి’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో శనివారం జరిగినపాటిబండ్ల సీతారామయ్య 144వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిసారిగా పాటిబండ్ల సీతారామయ్య పేరుపై జీవన సాఫల్య పురస్కారాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీకి జస్టిస్ ఎన్వీ రమణ ప్రదానం చేశారు. ఈ సభకు మాజీ డీజీపీ ఎం.మాలకొండయ్య అధ్యక్షత వహించారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.