Global Vaartha
Date of Publish : 01/11/2026, 9:44 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఓటమి భయంతో జగన్ కొత్త డ్రామాలు.. బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు!

పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో బాబాయిని హత్య చేసి ఆ నేరాన్ని టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు వాహనాలను తగలబెట్టి మరోసారి టీడీపీపై నిందలు వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముందురోజే వాహనాల దహనం జరగడం, తెల్లవారుజామునే దాడి జరిగిందంటూ ప్రచారం చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ డైరెక్షన్‌లోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని బీటెక్ రవి ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి.. టీడీపీకి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఘటనలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.ఓటమి భయంతోనే జగన్ కొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారని బీటెక్ రవి విమర్శించారు. పులివెందులలో అలజడి సృష్టించి ప్రజల్లో సానుభూతి పొందాలన్నది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోందని ఆరోపించారు. అయితే.. గతంలో మాదిరిగా ప్రజలు భయపడే పరిస్థితులు ఇప్పుడు లేవని, ఫ్యాక్షన్ రాజకీయాలకు పులివెందులలో కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం తొలగిపోయిందని.. వారు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. పులివెందుల ప్రజలు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారని, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని భావిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save